ఐపీఎల్ స్టార్ కు షాక్
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశికి భారీ జరిమానా పడింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యంత వివాదాస్పందంగా అవుట్ అయ్యాడు. దీనిపై అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతనికి ఈ శిక్ష పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా అందుకున్నాడీ బ్యాటర్.
ఐపీఎల్ లెవెల్-1 నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా పడింది. 'ఫీల్డింగ్ ను అడ్డుకోవడం (Obstructing the field) అని అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై రఘువంశి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్ కత నైట్ రైడర్జ్ ఇన్నింగ్ అయిదో ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు రఘువంశి. అప్పటికే బంతి ఫీల్డర్ చేతిలో ఉండటంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కామెరూన్ అతన్ని గ్రీన్ వెనక్కి పంపాడు. బంతిని గమనించిన రఘువంశీ వెనక్కి మళ్లాడు. క్రీజ్ వైపు పరుగెత్తాడు.

అదే సమయంలో రఘువంశిని రనౌట్ చేయడానికి మహ్మద్ షమీ వికెట్ల వైపు బంతిని విసిరాడు. వికెట్లకు తగలకుండా మధ్యలో ఉన్న రఘువంశీ ప్యాడ్స్ కు తగిలింది. దీంతో మహ్మద్ షమీ అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద అప్పీల్ చేయగా, అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియనన్ వైపు మళ్లిన రఘువంశి అక్కడే ఉన్న బౌండరీ కుషన్లను బ్యాట్ తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత డగౌట్‌లో కూడా తన హెల్మెట్‌ను విసిరేశాడు.
𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! 😳
— Star Sports (@StarSportsIndia) April 26, 2026
Mix-up. Long turn. Third umpire drama… & Raghuvanshi is given OUT for obstructing the field! 👀
Just the 4️⃣th instance of a batter being given out for obstructing the field in TATA IPL 🤯#TATAIPL 2026 ➡️ #LSGvKKR | LIVE NOW… pic.twitter.com/WRgr608Odb
ఇది ఐపీఎల్ లెవెల్-1 నిబంధనలను ఉల్లంఘన కిందికి వచ్చింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు రుజువైందని, ఇది మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదా మైదానంలో వస్తువుల దుర్వినియోగానికి సంబంధించినది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టింది. ఓ డీమెరిట్ పాయింట్ ను ఇచ్చింది. రఘువంశీ అవుట్ అయిన అనంతరం వివాదం రేగింది. కోల్ కత నైట్ రైడర్స్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ బౌండరీ లైన్ వెలుపల ఫోర్త్ అంపైర్‌తో మాట్లాడాడు.












Click it and Unblock the Notifications