సోదరుడు వేధిస్తున్నాడని రోజా ఫిర్యాదు!?
హైదరాబాద్: ప్రముఖ నటి రోజా తన సోదరుడి పైన పోలీసులను ఆశ్రయించినట్లుగా వార్తలు వచ్చాయి. తన సోదరుడి నుండి రక్షణ కల్పించాలంటూ ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. తన సోదరుడు రాంప్రసాద్ రెడ్డితో పాటు మేనేజర్ ప్రసాద రాజుల పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బుల కోసం తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె సోదరుడి పైన ఆరోపణలు చేశారట. రాంప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ భూమి విషయంలో రోజాకు, ఆయనకు వివాదం ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయమై అన్నయ్య ప్రవర్తన నచ్చకపోవడంతో రెండేళ్లుగా మాట్లాడడం లేదట. తనను బెదిరిస్తున్నారంటూ రోజా ఇటీవల పోలీసులను ఆశ్రయించారు.
అన్నయ్య, మేనేజర్ ప్రసాద రాజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, సినిమాల ద్వారా తాను కూడబెట్టుకొన్న మొత్తం సొమ్మును లాక్కున్నారని, ప్రస్తుతం టివిల్లో గేమ్ షోల్లో నటిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నానని, రాంప్రసాద్ రెడ్డి, ప్రసాద రాజు గురువారం ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని, బెదిరించారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారట. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వారు రాజీ పడ్డారట.












Click it and Unblock the Notifications