హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన: హైదరాబాద్‌పై కొత్త ప్రతిపాదన

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌పై కాంగ్రెసు అధిష్టానం మరో కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను ప్రత్యేక పరిపాలనా మండలిగా చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆధీనంలో శాంతిభద్రతలు, రెవెన్యూ, పట్టణాభివృద్ధి ఉండేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయం శుక్రవారం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ విషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమయ్యే ఫార్ములాను రూపొందించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను శాశ్వత నగర రాష్ట్రంగా మార్చాలని వస్తున్న డిమాండ్ సాధ్యం కాదని, దీనివల్ల తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని, తరుచూ రాజకీయ ఆస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోంది.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రతిపాదనను హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాదును స్వయంప్రతిపత్తి కలిగిన ప్రత్యేక పరిపాలనా మండలిగా ప్రకటించే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.

నదీజలాల పంపకంపై, హైదరాబాద్‌పై ఉన్న విభేదాలను ఆంటోనీ కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మొత్తం మీద, విభజనపై ముందుకు సాగుతూనే సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై సోనియా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Congress is thinking to make Hyderabad as special administration council in the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X