జగన్ సాకు: చంద్రబాబు తప్పించుకుంటారా?

అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకుండా ఎలా తప్పించుకోవాలనే విషయంపైనే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను జైలు నుంచి బయటకు తెప్పించుకోవడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఆ పార్టీ వాడుకుంటుందనే సాకులను చంద్రబాబు చూపుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే సాకును చూపడానికి అవసరమైన రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
తాను చేయబోయే పనికి ముందే ఓ ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. వైయస్ జగన్‌తో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కుమ్మక్కయి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారనే కొత్త వాదనను తెలుగుదేశం పార్టీ ముందుకు తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే మద్దతు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఆ కారణం చూపి వెనక్కి వెళ్తుందని భావించి, తెరాస అవిశ్వాసం ప్రతిపాదిస్తోందని అంటున్నారు.
మరో కారణాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తెస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు మద్దతు అడగాలి గానీ ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అడుగుతారా అని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో అన్నారు. అంతేకాకుండా తగిన సంఖ్యాబలం లేకుండా అవిశ్వాసం ఎలా ప్రతిపాదిస్తారని ఆయన అడిగారు. చూస్తుంటే, అవిశ్వాస తీర్మానాన్ని బలపరచకుండా ఉండడానికి తగిన కారణాలనే చంద్రబాబు వెతుకుతున్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications