వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌తో గొడవ: కిరణ్ రెడ్డికి చంద్రబాబు బాసట

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu supports Kiran move
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో శాసనసభ ప్రోరోగ్ విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాసటగా నిలిచారు. శాసనసభకు తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు సాధ్యమైనంత ఆలస్యం జరిగేలా చూడడానికి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ ప్రోరోగ్ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సు చేసినా శాసనసభను ప్రోరోగ్ చేయవద్దని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గవర్నర్ నర్సింహన్‌ను కోరుతూ లేఖ రాశారు. అతి సాధారణమైన విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ వివాదంగా మార్చారని అంటూ చంద్రబాబు కిరణ్ కమార్ రెడ్డికి అండగా ముందుకు వచ్చారు. ప్రోరోగ్ విషయంలో చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను తప్పు పట్టారు.

శాసనసభను ప్రోరోగ్ చేయాలని ముఖ్యమంత్రి పంపిన ఫైల్‌పై స్పీకర్ సంతకం చేసే విషయంలో ఆయన కార్యాలయం మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. శాసనసభను ప్రోరోగ్ చేయనందు వల్ల తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చినప్పుడు గవర్నర్ ఆర్టికల్ 174(1) కింద శాసనసభను సమావేశపరచవచ్చునని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శాసనసభను ప్రోరోగ్ చేయాలని సమాచారం వచ్చినప్పుడు దాన్ని సిఫార్సు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌కు ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఆర్డినెన్స్ తేవాలనే ఆలోచన ఉన్నప్పుడు, అది అవసరమైనప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం శాసనసభను ప్రోరోగ్ చేయాలని సూచిస్తుందని ఆయన అన్నారు.

అతి చిన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ ఎందుకు వివాదంగా మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. మొదటి నుంచి కూడా నాదెండ్ల మనోహర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డిది తనదీ ఒక్కటే మార్గం కాబట్టి చంద్రబాబు నాదెండ్ల మనోహర్‌ను తప్పు పడుతున్నారనే మాట వినిపిస్తోంది.

English summary

 Nara Chandrababu Naidu coming out strongly in defence of Chief Minister N. Kiran Kumar Reddy and finding fault with Speaker Nadendla Manohar for making an issue out of a routine matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X