చిరంజీవి అభిమానుల అవహేళన: తగ్గిన షర్మిల

గురువారం ఆమె చిరంజీవిని విమర్శించినప్పుడు మెగాస్టార్ అభిమానులు ఆమెను అవహేళన చేశారట. ఆమె వేలాది మంది కార్యకర్తలతో కాకినాడలోకి ఎంటర్ అయ్యారు. ఆమె జగన్నాయకపూర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విపక్షాలపై సిబిఐని ఉసిగొల్పుతూ.. పార్టీ నేతలను మాత్రం కాపాడుతోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో ఆమె చిరంజీవి పేరును ప్రస్తావించారు. కొద్ది నెలల క్రితం చెన్నైలోని చిరంజీవి బంధువు ఇంట్లో రూ.90 కోట్లు దొరికాయని, అయినప్పటికీ దానిపై ఎలాంటి విచారణ జరగడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న కొందరు చిరు అభిమానులు ఎద్దేవా చేశారట. దీంతో చిరంజీవి పేరు ప్రస్తావించడంతో ఎదురైన ఇబ్బందిని గుర్తించిన షర్మిల వెంటనే తన ప్రసంగాన్ని మార్చారట.
ఆ వెంటనే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పేరును ఎత్తుకున్నారట. బొత్స లిక్కర్ మాఫియా అని మండిపడ్డారు. బొత్స లిక్కర్ మాఫియా అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించే ఎలాంటి అవిశ్వాసానికైనా తాము మద్దతిస్తామని షర్మిల చెప్పారు. ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలపై వేటును ఆలస్యం చేశారని ఆమె ఆరోపించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications