'జగన్' చిచ్చు!: నాగ్, బాలయ్యల మధ్య గ్యాప్

Balakrishna - YS Jagan - Nagarjuna
టాలీవుడ్ అగ్ర నటులు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునల మధ్య గ్యాప్ వచ్చినట్లుగా చిత్ర పరిశ్రమలో జోరుగా చర్చ సాగుతోంది. వారిద్దరు శత్రువులు కాకపోయినా ఇద్దరు ప్రత్యర్థులుగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. టిఎస్సార్ జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరు అగ్ర నటులు ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో నందమూరి - అక్కినేని కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందనే వాదనకు మరింత బలం చేకూరిందంటున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వీరు ఎదురుపడ్డా పలకరించుకోలేదట. అంతేకాకుండా శ్రీరామరాజ్యం చిత్రానికి అవార్డును అందుకున్న బాలకృష్ణ ఆ చిత్రంలో వాల్మీకి పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించక పోవడం చర్చనీయాంశమైంది. నాగ్, బాలయ్యలు కార్యక్రమంలో చాలా సేపు ఉన్నప్పటికీ పలకరించుకోలేదు. ఎదురుపడ్డా ఏమీ మాట్లాడుకోలేదు. కనీసం ఒకరి మొహాలు ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడలేదట.

అందుకేనా?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను నాగార్జున తరుచూ కలస్తుండటం, ఆ పార్టీ నేతలతో నాగార్జున సన్నిహితంగా మెలుగుతున్నాడనే ప్రచారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల నాగార్జునను కూడా టార్గెట్ చేసుకుంది. ఈ కారణంగానే వారి మధ్య శత్రుత్వం లేకున్నా ప్రత్యర్థులుగా మారారంటున్నారు.

నాగార్జున వ్యాపారాల పైన టిడిపి నేతలు ఇటీవల విరుచుకుపడుతున్నారు. నాగార్జున వ్యాపారాలపై దృష్టి సారించాలని, ఆయనను కూడా విచారించాలని టిడిపి డిమాండ్ చేసింది. దీంతో నాగార్జున టిడిపిపై కోపంగా ఉన్నారని, అదే ఆగ్రహం ఆ పార్టీకి చెందిన నేత బాలయ్యపై కూడా సహజంగా ఉందని అంటున్నారు. మరోవైపు నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం నచ్చని బాలయ్య మాట్లాడేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. మొత్తానికి వారి మధ్య రాజకీయ చిచ్చు ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+