'లోకేష్ గర్ల్స్‌కు ఎస్ఎంఎస్‌లు పంపేవాడా'?

‘మీ అబ్బాయి అమ్మాయిలకు ఎస్‌ఎంఎస్‌లు పంపించేవాడా?' అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అబ్బాయిలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు యువకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గండ్ర బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, పుల్లా పద్మావతి కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా యువతను అవమానించాడని గండ్ర అంటున్నారు. "మీ కుమారుడు అలాగే పెరిగారా?" అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తాను మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని చెప్పడం విస్మయం కలిగించిందని అన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం చారిత్రాత్మక అవసరమా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలు ఇస్తున్నా ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే విధ్వంసం సృష్టిస్తామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని చెప్పగా, అలా చేస్తే అక్బరుద్దీన్ పరిస్థితి ఆ శాసనసభ్యుడికి ఎదురవుతుందని గండ్ర అన్నారు. తన కుమారుడిని తాను అలా పెంచలేదని చంద్రబాబు సమర్థించుకోవడానికి ఏ మాత్రం వెనకాడబోరనేది వేరే మాట.












Click it and Unblock the Notifications