రాని ఆహ్వానం: బాబుపై మళ్లీ అలిగిన హరికృష్ణ?

Harikrishna avoids Praja garjana
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ప్రజా గర్జనకు పిలుపు రాలేదట. దీంతో ఈ రోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఆ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. ప్రజా గర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణకు తెలుగుదేశం పార్టీ ఆదివారం నుంచి శ్రీకారం చుడుతోంది.

ముఖ్యమైన కార్యక్రమాలను తిరుపతి నుంచి మొదలు పెట్టడం ఆనవాయితీగా చేపడుతున్న చంద్రబాబు ఈ సభలనూ అక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అన్ని జిల్లాల్లోనూ ఈ సభలను నిర్వహిస్తామని బాబు తెలిపారు.

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, తెలుగు జాతికి పునర్‌వైభవం తేవడం లక్ష్యంగా తాము సభలను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. ఈ ప్రజా గర్జన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణకు ఆహ్వానం అందలేదంట. దీంతో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న ఆయన ప్రజా గర్జనకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారట.

చంద్రబాబుకు హరికృష్ణ మొదటి నుండి కొరకరాని కొయ్యలా తయారయిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ అంశంలోను పార్టీ నిర్ణయం మేరకు బాధాకరమైనా విభజనకు కట్టుబడి ఉన్నానని లేఖ రాసిన హరి... ఆ తర్వాత కొద్ది రోజులకే మనసు మార్చుకొని పార్టీ లైన్ నుండి మారారు. రాజీనామాల విషయంలోను సొంత ఎంపీలు తనను మోసం చేసినట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రజా గర్జనకు ఆహ్వానం అందక పోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+