తెలంగాణపైనే బాబుపై హరికృష్ణ అలక?

తెలుగు జాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించన తన తండ్రి ఎన్టీ రామారావు కృషి చేశారని, ఆ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన మండిపడుతున్నట్లు సమాచారం. తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకతూలంగా హరికృష్ణ గతంలో ఓసారి బహిరంగ లేఖ కూడా రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఎన్టీ రామారావును తెలంగాణ ప్రజలు మొదటి నుంచీ ఆదరిస్తూ వస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ కూడా ఉంది. అయితే, తెలంగాణ నినాదం ఊపందుకున్న తర్వాత ఆ క్యాడర్ జారిపోతూ వచ్చింది. తెలంగాణపై చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు ఇతర పార్టీలు కూడా తెలంగాణపై చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చాయి.
రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన చంద్రబాబు నాయుడికి తెలంగాణ నినాదం గొడ్డలిపెట్టులా పరిణమించింది. తెలంగాణ ప్రాంతంలోని నాయకులు పార్టీని వదిలేసే పరిస్థితి వచ్చింది. దీంతో క్రమ క్రమంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా మారుతూ వచ్చారు. ఆ మేరకు సీమాంధ్ర నాయకులను కూడా సంసిద్దం చేస్తూ వచ్చారు. ఇది హరికృష్ణను చంద్రబాబుకు దూరం చేసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications