'వర్కింగ్' అలక: కె కేశవరావుకు కెసిఆర్ ఝలక్?

వివేక్, మందాలతో పాటు వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఆఖరు నిమిషంలో ఆయనకు టిక్కెట్ పైన కెసిఆర్ నుండి హామీ రాకపోవడంతో వెనక్కి తగ్గారట. కెకె, మందా, వివేక్‌లు మాత్రం చేరారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని, తెలంగాణ కోసమే తెరాసలో చేరుతున్నానని చెప్పిన కె కేశవ రావుకు కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తానని హామీ ఇచ్చారట.
అయితే ఇప్పుడు కెసిఆర్ అందుకు సుముఖంగా లేరని ప్రచారం సాగుతోంది. దీంతో కె కేశవ రావు అలక వహించారని అంటున్నారు. శనివారం సాయంత్రం కెకెను కలిసిన కెసిఆర్ తదితర పార్టీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారట. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఇరువురికి ఇబ్బంది అని, కాబట్టి తెరాస వర్కింగ్ కమిటీ లేదా కోర్ కమిటీని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్‌గా చేస్తామని చెప్పారట.
అయితే ముందుగా చెప్పినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకపోవడంపై కెకె అలక వహించారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీలు, సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండే కోర్ కమిటీ లేదా వర్కింగ్ కమిటీలో కెకెను చైర్మన్‌గా నియమించి, ఆయనకు కెసిఆర్‌తో సమాన ప్రాధాన్యత ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారట. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పైన హామీ నిలుపుకోకపోవడంపై మాత్రం ఆయన అలక వహించారట.












Click it and Unblock the Notifications