'అత్తారింటికెళ్లారు: పవర్ కల్యాణ్‌లా వద్దు'
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గవర్నర్ నరసింహన్ రాజకీయాలపై హెచ్చరించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల పాటు జరిగిన 18వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం లలిత కళా తోరణంలో ముగిశాయి.
ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి డికె అరుణలతో పాటు హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఈ సమయంలో నరసింహన్.. పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

పవన్‌ను ఉద్దేశించి ఆరడుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అని చెప్పిన గవర్నర్ ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు. అయితే పవన్ కల్యాణ్ ఇంట్లో పవర్ కల్యాణ్‌లా కాకుండా పవన్ కల్యాణ్‌లా ఉండాలి' అని ఛలోక్తులు విసిరారు. ఈ సమయంలో పవన్ ముసి ముసి నవ్వులు నవ్వారు.
ఇటీవల పవన్ రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఖండించినప్పటికీ.. పుకార్లు వినిపించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లోకి రావొద్దనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆ హెచ్చరికను చలోక్తిగా చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications