పిక్చర్స్: సినీ పెద్దలు ఏ రాజకీయ పార్టీ వైపో?
హైదరాబాద్: కొంత మంది సినీ ప్రముఖులు ఏ పార్టీ వైపు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. తమ రాజకీయ ఆసక్తులను వారు బయటపెడుతూనే ఎటు వైపు ఉంటామనే విషయాన్ని కొద్ది మంది దాస్తుండగా, మరికొంత మంది తమకు రాజకీయాలు ఒంట బట్టవని చెబుతున్నారు. అయినా, వారు ఎటు వైపు ఉంటారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తాము ఎటు వైపు ఉంటామో తేల్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని కూడా అంటున్నారు.
2014 ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకూ ప్రాణప్రతిష్ఠగా పరిణమించాయి. అన్ని పార్టీలూ సినీ తారలను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మోహన్‌బాబు, కృష్ణంరాజు, జయప్రద, దాసరి నారాయణరావు నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు ముగిసే వరకు వేచి చూసి, ఆ తర్వాత ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఆయన ఇప్పటికే రాయలసీమకు చెందిన ఒక మంత్రి, మరికొందరు నిర్మాతలతో జగన్ పార్టీలో చేరే అంశంపై మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూడా తాను త్వరలో ఒక పార్టీలో చేరతానంటున్నారు. వైయస్ కుటుంబంతో వియ్యమందుకున్న మోహన్‌బాబు కూడా వైయస్సార్ తీర్థం తీసుకోవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలన్న అంశంపై వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఆయనతో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఆయన సన్నిహితులు కొందరు తిరిగి బిజెపిలో చేరాలని సలహా ఇస్తుండగా, ఆయన మనసు మాత్రం వైయస్సార్ కాంగ్రెసు వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు అనిల్ కుటుంబంతో సన్నిహిత సత్సంబంధాలున్నందున కృష్ణంరాజు చేరిక ఖాయమంటున్నారు.
ఎన్నికల సమయం లో అక్కినేని నాగార్జున వైకాపా పక్షాన ప్రచారం చేసే అవకాశం ఉందని భారీ స్ధాయిలో ప్రచారం జరుగుతోంది. వైయస్ వల్ల గతంలో భారీగా ఆర్ధికంగా లబ్థి పొందిన నాగార్జున భూకబ్జాలపై విచారణ చేయించాలని తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చంచల్‌గూడ జైలులో ఉన్న నిమ్మగడ్డను తరచూ కలుస్తున్న నాగార్జున, ఆ పేరుతో జగన్‌నూ కలుస్తున్నారని తెలుగుదేశం నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పథకాలపై నాగార్జున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాధ్ కుటుంబం కూడా ఇప్పటికే జగన్ పార్టీ తీర్ధం తీసుకున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్, వైయస్సార్ నేతలు తమ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ ఫొటోలు వాడుకోవడంపై వివాదం జరుగుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖ, అనంతపురం, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని తాను చెబుతున్నా ఇతర పార్టీలు తన బొమ్మను వాడుకోవడాన్ని ఖండించడం లేదు.

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు రాజకీయాల్లో ఎటు వైపు ఉంటారనేది ఇంకా తేలడం లేదు. కాంగ్రెసులోకి చిరంజీవి వచ్చిన తర్వాత ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చునని అంటున్నారు. అయితే, బిజెపి నాయకులు ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బిజెపి ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా తాను ఏ పార్టీ వైపు ఉంటాననే విషయాన్ని తేల్చడం లేదు. రాజకీయాల్లోకి మాత్రం వస్తానని గట్టిగానే చెబుతున్నారు. ఆయన కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

తనకు, తన కుటుంబానికి రాజకీయాలు పడవని, తాను రాజకీయాల్లోకి రాబోనని నాగార్జున స్పష్టం చేసినా ఆయన రాజకీయ నిబద్ధతపై ప్రచారం సాగుతూనే ఉంది. ఆయన వైయస్ జగన్ పార్టీకి మద్దతు ఇవ్వవచ్చునని అంటున్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా ఎవరూ విశ్వసించడం లేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ప్రభాస్‌కు బ్రదర్ అనిల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. దీంతో బాబాయ్ కృష్ణంరాజును వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేర్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications