హరికృష్ణ వ్యాఖ్యలు పురంధేశ్వరికీ వర్తిస్తాయా?

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోనియా గాంధీ కాళ్ల వద్ద బేరానికి పెట్టారని, అధికార ప్రాపకం కోసం రాజకీయ వ్యభిచారులు తెలుగుతల్లికి గర్భశోకం కలిగించారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా ఉన్న దగ్దుబాటి పురంధేశ్వరికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా హరికృష్ణ తన తెలుగుదేశం పార్టీని కూడా అన్యాపదేశంగా, నర్మగర్భంగా విమర్శించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తగిలే విధంగా ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలూ తిలా పాపం తలా పిడికెడు అనే విధంగా వ్యవహరించాయని అన్నారు. అంటే, తెలుగుదేశం పార్టీకి కూడా అందులో పాత్ర ఉందనే విధంగా ఆయన అన్నట్లు భావిస్తున్నారు.
కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హరికృష్ణ శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఏ పార్టీకి సంబంధం లేనట్లుగా, రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని దుయ్యబడుతూ ఆయన ఆ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications