వైయస్ సమైక్యవాది: జగన్ బాబాయ్ హెచ్చరిక

ముఖ్యంగా సీమ జోలికొస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. వైయస్ రాజశేఖర రెడ్డిి 64వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఆయన ప్రసంగించారు. వచ్చే పంచాయతీ, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చడానికి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ ఆశయ సాధనం కోసం తన వంతు కృషి చేస్తామన్నారు. వైయస్ కరుడుగట్టిన సమైక్యవాది అని, వైయస్హయాంలో రాష్ట్ర విభజనను సమర్థవంతంగా అడ్డుకున్నారని వివేకానంద రెడ్డి గుర్తు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన రాయలసీమ నాయకులు సమైక్యవాదం కోసం గట్టిగా గొంతు విప్పుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి సహా ముగ్గురు శాసనసభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications