బాబు 'జగన్' టార్గెట్ రివర్స్: ఎమ్మెల్యేల అసంతృప్తి!
హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలాగే భావిస్తున్నారని అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన జన్మభూమిలో ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఉండేది. కానీ ఈ జన్మభూమిలో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతోందని అధికార పార్టీ సభ్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటున్నారు.
జన్మభూమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు వాపోతున్నారని చెబుతున్నారు. జన్మభూమిలో ప్రధానమైన అంశం పింఛన్లు. అనర్హులను తొలగించి, అర్హులకు పింఛన్లు అందచేయడంలో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ మొత్తాన్ని అధికారులకు చంద్రబాబు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందంటున్నారు.

సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కార్యక్రమాలు ఏయే రోజుల్లో, ఏయే గ్రామాల్లో నిర్వహించాలో అధికారులే నిర్ణయింస్తున్నారని, ఇది కూడా ఎమ్మెల్యేలను అయోమయంలో పడేసిందంటున్నారు. అయితే, దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా పలువురు అభిప్రాయపడుతున్నారు.
67 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జన్మభూమిలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగులుగుతుందని భావించిన చంద్రబాబు జన్మభూమిలో ఏ కోణంలోనూ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకుండా చేశారని అంటున్నారు. జగన్ పార్టీని టార్గెట్ చేసుకుంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోను అసంతృప్తి కనిపిస్తోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications