హుధుద్: విజయమ్మకు ఓటేయకనే అని...!?

అక్టోబర్ 12 అంటే భయమే...
అక్టోబర్ 12వ తేదీ అంటే ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలకు, ఒడిశాలోని తీరప్రాంత ప్రజలకు భయం పట్టుకుంది. 2013 అక్టోబర్ 12న ఫైలిన్ పెను తుపాను ఒడిశాతోపాటు ఉత్తర కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. ఆనాడు ఫైలిన్ తుపాను విశాఖపట్నం సమీపంలోని ఒడిశాలోగల గోపాలపురం వద్ద తీరం దాటింది.
ఫైలిన్ వల్ల ఉత్తర కోస్తాతో పాటు ఒడిశాలో భారీ నష్టం జరిగింది. ఫైలిన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కన్నా ఒడిశా మరింత ఎక్కువ నష్టపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2014 అక్టోబర్ 12న హుధుద్ పెను తుపాను ఉత్తర కోస్తా జిల్లాలను వణికించింది.
విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దీనివల్ల జనజీవనం స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం ఈ తుపానుకు దెబ్బతిన్నది. సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో తుపాన్లు వస్తున్నప్పటికీ, ఒకే తేదీన తుపాన్లు కోస్తా తీరాన్ని తాకింది.
విమానాశ్రయం ఇప్పట్లో కోలుకోదా?
నాలుగు, ఐదు సంవత్సరాల వరకూ ప్రతి ఏటా వర్షాకాలంలో వరద నీటితో ఈ విమానాశ్రయం మునిగిపోతుండేది. రన్‌వేపై భారీగా వరద నీరు వచ్చి చేరేది. ఎయిర్ పోర్టు ఆవరణలోకి చేరిన నీటిలోనే చేపలు పట్టే వారు. నగరంలో చిన్నపాటి పొగ మంచు ఏర్పడితే, విమానాలు గాలిలో చక్కర్లు కొట్టి, ల్యాండ్ అవడానికి వీల్లేక వెనక్కు తిరిగి వెళ్లిపోయేవి. అటువంటి దయనీయ పరిస్థితిని నుంచి విమానాశ్రయాన్ని ఆధునీకరించారు.
సుమారు 200 కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ భవనం, 100 కోట్లతో అత్యాధునిక రన్‌వే నిర్మించారు. దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేయాలన్న ఆలోచనతో, దానికి కావల్సిన అన్ని హంగులను కల్పించారు. ఎంతో కష్టపడి రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఇక్కడికి రప్పించారు. దేశీయ సర్వీసులను పెంచారు. త్వరలోనే దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని అనుకున్నారు.
కానీ, హుదూద్ తుపాను విమానాశ్రయ భవిష్యత్తునే కాలరాసింది. తుపాను దెబ్బకు విమానాశ్రయ లాంజ్ పూర్తిగా దెబ్బతింది. దీన్ని పునర్నిర్మించడం ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెపుతున్నారు. దీన్ని పునర్నిర్మించేకన్నా, కొత్త లాంజ్ నిర్మించుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో విశాఖకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గడచిన నాలుగు రోజులుగా విశాఖకు విమాన సర్వీసులు నిలిచిపోయాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విమాన సర్వీసులను పునరుద్ధరించాలంటే టెర్మినల్ భవనాన్ని పునర్నిర్మించాలి. అది సాధ్యం కాదని తేలడంతో మళ్లీ పాత టెర్మినల్ భవనాన్నే వినియోగించుకోవాలని నిర్ణయించారు. పాత టెర్మినల్ భవనానికి మళ్లీ హంగులు కల్పించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు విశాఖ రానున్నారు. అలాగే సెక్యూరిటీ అధికారులు కూడా పాత టెర్మినల్ భవనాన్ని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications