నగారా మోగించిన తెలంగాణ సీఎం కేసీఆర్... అన్ని జిల్లాల్లో శిల్పారామాలు (ఫోటో)

హైదరాబాద్: మాదాపూర్ లోని శిల్పారామంలో 19వ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతి వెలిగించి, నగారా మోగించి సంప్రదాయబద్ధంగా మేళాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంచించుకు పోయిన శిల్పారామాన్ని కాపాడుకుందామని అన్నారు. శిల్పారామంలో సిమెంట్ కట్టడాలు నిర్మించి కళ పోయేలా చేశారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

KCR Beating Drum in Hastha Kala Mela in Shilparamam

ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే విధంగా శిల్పారామాన్ని తీర్చిదిద్దు కోవాల్సి ఉందని అన్నారు. మన కళలను జిల్లాల్లో వ్యాపింపజేసేలా అన్ని జిల్లాల్లో శిల్పారామాలు నిర్మించుకుందామని తెలిపారు. తెలంగాణ వైభవం తరతరాలు కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.

ఏడాది పొడువునా శిల్పారామంలో కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించుకుందామన్నారు. మేళా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. క్రాఫ్ట్స్ మేళాలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక్కడి నుంచి మంచి సందేశం తీసుకెళ్లాలని కేసీఆర్ వారికి సూచించారు. ఈ నెల 31 వరకు జరిగే క్రాఫ్ట్స్ మేళాలో 500 స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్త కళాకారులు తమ వస్తువులను ఇక్కడ అమ్మకానికి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+