వైయస్ జగన్‌తో సోదరి షర్మిల ప్యాచప్?

 Patch up between Sharmila and YS Jagan?
గుంటూరు: సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వైయస్ షర్మిల అవగాహన కుదిరినట్లు భావిస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య ఏర్పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి 76వ బైబిల్ మిషన్ మహా సభల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు.

వైయస్ కుటుంబం కోసం, జగనన్న విడుదలకు బైబిలు మిషన్ మహాసభల్లో ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వారందరికీ రాజన్న కుటుంబం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తోందని షర్మిల అన్నారు. మనిషిని దేవుడు ఎంతో ప్రేమగా పుట్టించాడనీ, అంతే ప్రేమగా ఆయనపై ప్రేమ, సమానత్వంతో మనుగడ సాగించాలని వైఎస్ షర్మిల అన్నారు.

నీతిమంతుడైన దేవుడు పాపులను పరిరక్షించి వారికి అన్ని విధాలా రక్షణ కలిగించేందుకే భువిపైకి వచ్చారన్నారు. మనుషుల్లో పెరిగిన పాప ప్రక్షాళన కోసం క్రీస్తు పడిన కష్టాలు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించాయన్నారు.

ఈ మహాసభల్లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ క్రీస్తు వాక్యోపదేశాన్ని దైవజనుల కోసం అందించారు. దేవుని స్తుతి గేయాలు, ప్రార్థనలతో ఈ వాక్యోపదేశం గంటన్నర సేపు జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+