అధిష్టానంపై శివాలెత్తిన రేణుకా చౌదరి

Renuka hits out at Cong high command for not giving Khammam seat
హైదరాబాద్: పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శివాలెత్తారు. అధిష్టానంపై ఆమె ఆదివారంనాడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖమ్మం లోకసభ సీటు టికెట్ తనకు ఇవ్వకపోవడంపై ఆమె మండిపోతున్నారు. పొత్తులో భాగంగా ఖమ్మం లోకసభ సీటును కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది.

ఖమ్మం స్థానం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ పోటీ చేస్తున్నారు. ఖమ్మం లోకసభ సీటుకు రేణుకా చౌదరి 1999లోనూ, 2004లోనూ ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు చేతిలో ఓటమి పాలయ్యారు.

తెలంగాణలో పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం మహిళలను పట్టించుకోలేదని రేణుకా చౌదరి విమర్శించారు. మహిళ సాధికారిత గురించి వేదికల మీద అందరూ చెప్తారని, అయితే అసలు విషయానికి వచ్చే సరికి వారిని విస్మరిస్తారని ఆమె అన్నారు.

ఖమ్మం లోకసభ సీటు నుంచి తనను కాదని పోటీ చేసే మగాడు ఎవడంటూ రేణుకా చౌదరి ఆ మధ్య ఓసారి అన్నారు. అయితే, రేణుకా చౌదరిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు మొదటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆమెను తెలంగాణ బిడ్డ కాదంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+