అమ్మో, ఇదేమిటి: మహిళ కల్లు సీసాలో పాము
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో కల్లు సీసాలో పాము వచ్చింది. గ్రామానికి చెందిన చిటికెల అంజమ్మ గురువా రం రాత్రి గ్రామంలో ఉన్న కల్లు దుకాణానికి వెళ్లి కల్లు సీసా తీసుకుంది.
ఆమె కల్లు తాగుతుండగా అందులో పాము కనిపించింది. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. విషయాన్ని గ్రామస్థులకు తెలపడంతో కల్లు దుకాణం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. సీసాల్లో పాములు వస్తే ప్రాణాలుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు దుకాణం యజామాన్యంపై మండిపడ్డారు.

వెంటనే కల్లు దుకాణం మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కల్లు సీసాను పాముతో సహా షాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఎస్ఐ చంద్రకాంత్ వారితో మాట్లాడి విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడి నుంచి కల్లుసీసాతో చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. మండలంలోని పలు గ్రామాల్లో కల్తీకల్లు తాగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటే సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications