స్వరూపానంద మరో గొడవ: ఈసారి దేవుళ్లపై..
హైదరాబాద్: విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం అరిష్టమని ఆయన ఇదివరకు చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆయన దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ప్రస్తుత సమాజంలో దేవుళ్ల గొడవ ఎక్కువైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే తగువులు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇంట్లో, వీధుల్లో, రాజకీయాల్లో జరిగే గొడవల కన్నా దేశంలోని దేవుళ్ల గొడవ అధికంగా ఉందని ఆయన అన్నారు

విశుద్ధ వేదాంత సర్ అనే హిందీ అనువాద గ్రంథాన్ని ఆయన సోమవారం టిటిడి ధ్యానమందిరంలో ఆవిష్కరించి ప్రసంగించారు. పీఠాల ద్వారా శంకరాచార్యులు ఏం చెప్పారు, వేదాంతసారం ఏమిటన్నది చెప్పడానికే ఈ పుస్తకం రచించినట్లు తెలిపారు. ఈ అంశాలను ఉత్తర భారత ప్రజలకు తెలియజెప్పేందుకు ఆ గ్రంథాన్ని హిందీలో తెచ్చినట్లు స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.
స్వరూపానందేంద్ర సరస్వతి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే, స్వరూపనందేంద్రకు కూడా మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications