మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై విజయశాంతి పోటీ చేస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi may contest against k chandrasekhar rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై తీవ్రంగా మండిపడిన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావుతో తలపడేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత విజయశాంతి బయటకు వచ్చి తెరాస నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస తన చావును కోరుకుంటోందని ఆమె వ్యాఖ్యానించారు.

తెరాస నుంచి విజయశాంతి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిశారు. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరేందుకు అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె కాంగ్రెసు అభ్యర్థిగా కెసిఆర్‌పై తలపడేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెసులో తెరాస విలీనమైతే విజయశాంతికి ఆ అవకాశం రాకపోవచ్చు. అయితే, విజయశాంతి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. దానికోసమే ఆమె కాంగ్రెసులో చేరాలని అనుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు.

నిజానికి, తెరాసలో అన్నాచెల్లెళ్లుగా విజయశాంతి, కెసిఆర్ ఆప్యాయంగా మెలుగుతూ వచ్చారు. కానీ తన పట్ల వివక్ష ప్రదర్సిస్తున్నారనే ఉద్దేశంతో విజయశాంతి వ్యవహరిస్తూ వచ్చారు. కెసిఆర్ చర్యలు కూడా అందుకు దోహదం చేశాయి.

English summary

 It is said that MP Vijayashanthi, suspended from TRS is in a bid to contest against Telangana Rastra Samithi president K Chandrasekhar rao in Medak constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X