నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందమైన శాఖాహారి ఈ ఏపి ముద్దుగమ్మ(ఫొటో)

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇషితా జైన్‌(24)కు అరుదైన గౌరవం దక్కింది. పెటా(పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఏనిమల్స్‌) నిర్వహించిన ‘అందమైన శాకాహరి' పోటీలకు సంబంధించి మహిళా విభాగం లో విజేతగా నిలిచింది.

పెటా విడుదల చేసే పుస్తక ఆమె ఫొటోను ముఖచిత్రంగా వాడనున్నారు. తొమ్మిదిమంది అమ్మాయిలను వెనక్కినెట్టి 2330 ఓట్లతో ఇషిత ప్రథమ స్థానంలో నిలిచింది. ‘నేను నా జీవితాంతం శాకాహారిగానే ఉంటాను. రుచికోసం మరో ప్రాణిని చంపాలని నేననుకోవడంలేదు' అని ఇషిత పేర్కొంది.

AP resident crowned 'cutest vegetarian next door' by PETA

‘ఇషితా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె అందం మా పుస్తకానికి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దుతుంది' అని పెటా ఇండియా న్యూట్రిషనిస్ట్ భువనేశ్వరి గుప్తా తెలిపారు. శాఖాహారమే మనిషి ఆరోగ్యానికి మొదటి సూత్రమని చెప్పారు. జంతువుల వధను మాని, శాఖాహారులుగా మారాలని ఆమె పిలుపునిచ్చారు.

కాగా, ఈ పోటీల్లోని పురుషుల విభాగంలో అహ్మద్‌నగర్‌కు చెందిన అభిజిత్‌ వాగ్మేర్‌ విజేతగా నిలిచాడు.

English summary
Ishita Jain of Nellore in Andhra Pradesh has beaten out nine other female finalists to win People for the Ethical Treatment of Animals (PETA) India's 'Cutest Vegetarian Next Door' contest, with 2,330 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X