రూపాయి అడిగితే, తన్నిన మహిళా మంత్రి(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి... ఓ వ్యక్తి రూపాయి దానం అడిగినందుకు కాలితో తన్నారు. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఇది వివాదాస్పదమైంది. ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే మానవత్వాన్ని మరిచారు.
దానంగా ఒక రూపాయి అడిగాడనే కారణంతో ఓ అడుక్కునే పిల్లాడిని కాలితో తన్నింది సదరు మహిళా మంత్రి. భోపాల్‌కు సమీపంలోని పన్నాలో జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్‌లో చెత్త ఊడ్చే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా దానం చేయాలని ఓ పిల్లాడు అభ్యర్థించాడు. దాంతో అసహనానికి గురైన మంత్రి బాలుడిని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా పసివాడిపై అంగరక్షులు చేయిచేసుకున్నారు. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది.
మంత్రివర్గం నుంచి కుసుమ్ మెహ్దేలేను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా, సదరు మహిళా మంత్రి గతంలోను వివాదాల్లో కూరుకుపోయారు. ఇటీవల సింహాలను, పులులను ప్రజలు పెంచుకొనే విధంగా చట్టాన్ని రూపొందించాలని వ్యాఖ్యానించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications