నోటుకు ఓటు: రాజ్‌నాథ్ సింగ్‌కు చంద్రబాబు ఫోన్?
న్యూఢిల్లీ: ఓటుకు నోటుకు కుంభకోణం కేసు తనకు కూడా చుట్టుకోబోతున్నట్లు అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన మంగళవారం ఓటుకు నోటు కుంభకోణం పరిణామాలపై మరోసారి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మరోసారి మాట్లాడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంపై ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తనను లేదా తన టిడిపి ఎంపీలకు నోటీసులు జారీ చేయటం లేదా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని హోంమంత్రి దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఒకటి రెండురోజుల్లో నోటీసులిచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్న చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగానే రాజ్‌నాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతోనూ బాబు మాట్లాడారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజ్‌నాథ్ సింగ్ ఓటుకు నోటు కేసుపై మాట్లాడేందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు. అంతా హోం శాఖ అధికారి గోయల్ చూసుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications