లెక్క చేయని మంత్రులు: చంద్రబాబు ఆగ్రహం?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరి ఇష్టం ప్రకారం వారు నడుచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు సూచనను కూడా వారు ఖాతరు చేయండ లేదా అనే అనుమానం వస్తోంది. వారాంతంలో హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని చంద్రబాబు చెప్పినా మంత్రులు పట్టించుకోలేదని అటున్నారు. దీంతో చంద్రబాబు అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది.
తిరుపతి పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం హైదరాబాదు నగరంలోని సీఎంవో ద్వారా మంత్రులకు సమాచారం అందించి తప్పనిసరిగా శనివారాల్లో హైదరాబాద్‌లో ఉండేలా తమ షెడ్యూళ్లను రూపొందించుకోవాలని సూచించినట్లు సమాచారం.

చంద్రబాబు ఇది వరకు లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో కూడా మంత్రులు వారాంతంలో అందుబాటులో ఉండాలని, లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని మంత్రులకు సూచించారు. కార్యక్రమాలను సమీక్షించుకుని, తదుపరి కార్యక్రమాలను రూపొందించుకోవడానికి వారాంతంలో తప్పకుండా అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. కానీ, ఆయన మాటలను మంత్రులు పెడచెవిన పెట్టినట్లే ఉన్నారు.
కాగ్రా ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించే భారత బృందానికి చంద్రబాబు నాయకత్వం వహించనున్నారు. భారత్ నుంచి చైనా వెళ్లే ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా విదేశాంగశాఖ ఆయనను కోరింది. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు.












Click it and Unblock the Notifications