ప్లీనరీ: హరీశ్ రావుకు థమ్సప్ చెప్పిన కెసిఆర్
హైదరాబాద్: నగరంలోని కొంపల్లిలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి మంత్రులు, ముఖ్య నేతలందరూ కూర్చున్న వైపు చూస్తూ.. వేదిక మీదకు చేరుకున్నారు.
అప్పటికే సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ లేచి నిలుచుని సిఎం కేసీఆర్‌కు చేతులు జోడించి నమస్కరించారు. ప్రతిగా కేసీఆర్ కూడా వారికి నమస్కరించారు. ఈ క్రమంలో తన మేనల్లుడు హరీశ్ రావును చూస్తూ తల ఊపుతూ... బొటనవేలు (థమ్సప్) పైకెత్తి చూపించారు. మంత్రి హరీశ్ కూడా అదే విధంగా స్పందించారు. ఈ సన్నివేశాన్ని పలువురు ఆసక్తిగా చూశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన నేత రాజయ్య కూడా ప్లీనరీకి రావడంతోనే కెసిఆర్ ఈ విధంగా చేశారేమోనని పలువురు పేర్కొంటున్నారు.

కాగా, సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ.. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘హైదరాబాద్‌ను నేనే కట్టిన అని ఒగడంటడు. హైటెక్‌గా మార్చానని మరొకడు అంటడు. ఇంకోడు ఇంకేదో అంటడు. ప్రభుత్వం, మున్సిపాలిటీ వల్ల హైదరాబాద్ సిటీ నడవటంలేదు. కేవలం ధర్మం మీద నడుస్తోంది' అని అన్నారు.
‘హైదరాబాద్‌లో 85 లక్షల జనాభా ఉంది. ప్రతి రోజూ వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిపోయే వాళ్లు మరో 15-20 లక్షల మంది ఉంటారు. అంటే... హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంది. ప్రతి 10వేల మందికి ఓ కూరగాయల మార్కెట్ లెక్కన వెయ్యి మార్కెట్లు ఉండాలి. కానీ, 24 కూరగాయల మార్కెట్లే ఉన్నాయి. ఇంకా బస్ షెల్టర్లు, చనిపోతే కాల్చే శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్లు, బట్టలు ఉతుక్కునే దోబీ ఘాట్లు లేవు' అని చెప్పారు.
‘జర పెద్ద వాన పడ్తే సీఎం నివాసం ఉండే బేగంపేట, గవర్నర్ ఉండే రాజ్‌భవన్, ఘనత వహించిన అసెంబ్లీ ఎదురుగా నడుముల లోతు నీళ్లు వస్తాయి. ఎవరో నాతో... మీది హైటెక్ రాష్ట్రం అట అన్నారు. అవును.. మాది హైటెక్ రాష్ట్రమే. మా కార్లు వానాకాలం వస్తే పడవులు అవుతాయని చెప్పా. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత రియల్ స్మార్ట్ సిటీగా మార్చుతాం. దీనిని ఎవరూ ఆపలేరు' అని కేసీఆర్ స్పష్టం చేశారు.
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications