షాక్: కోడికూర కోసం కొట్టుకున్న ఇద్దరు పోలీసులు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో ఇద్దరు పోలీసులు కోడి కూర కోసం కొట్టుకొని, ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పేలేరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ల మధ్య కోడి కూర కోసం గొడవ జరిగింది. వారిద్దరు బాహాబాహీకి దిగారు. ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. చికెన్ కోసం గొడవపడి ప్రతిష్టను మంటగలిపారు. అంతేకాదు, ఘటన అనంతరం వారు పోలీసు స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

కాగా, పోట్లాడుకున్న వారిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర అని, కానిస్టేబుల్ చలపతి అని తెలుస్తోంది. వీరి పైన అధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications