హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టులో సుజనా చౌదరి కంపెనీకి చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి కంపెనీకి హైకోర్టులో చుక్కెదురయింది. సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంకు పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి హైకోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుజన యూనివర్శల్ ఇండస్ట్రిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

సుజన యూనివర్శల్ ఇండ్రస్టీస్ కేంద్ర మంత్రి సుజన చౌదరికి సంబంధించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ రవి కుమార్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది.

వంద కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో సుజన ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ సంస్ధ హైస్టియా కంపెనీ విఫలమైనందు వల్ల గ్యారంటర్‌గా ఉన్న సుజన ఇండ్రస్టీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి కోర్టు విచారించి అనుమతించింది. అప్పు ఇచ్చిన మారిషస్ బ్యాంకు గ్యారంటర్ సంస్ధను లిక్విడేట్ చేయాలని కోరరాదంటూ సుజన ఇండస్ట్రీస్ హైకోర్టును కోరింది. అప్పు ఇచ్చిన సంస్ధ సివిల్ కోర్టుల్లో దావా వేయడం ద్వారా సొమ్మును రాబట్టుకునే హక్కు ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

sujana chowdary

గతంలో గ్యారంటర్ సంస్ధ సొమ్ము విషయమై హామీ ఇచ్చినా చెల్లించలేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మారిషస్ కంపెనీని నిరుత్సాహపరిస్తే, అనేక ఇండియా కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు కట్టుబడి ఉండకపోయే ప్రమాదం ఉందని న్యాయస్థానం పేర్కొంది.

అదే సమయంలో, సుజన ఇండస్ట్రీస్ మూసివేత కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణఖు స్వీకరించిన విషయాన్ని ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వరాదన్న సింగిల్ జడ్జి ఇఛ్చిన ఇత్తర్వులపై మారిషస్ కమర్షఇయల్ బ్యాంకు దాఖలు చేసిన అప్పీలు పైనా నిర్ణయం వెలువరించింది.

సింగిల్ జడ్జి ఇచ్చిన 6 నెలల గడువును కుదిస్తీ ఐదు నెలలకు పరిమితం చేసింది. మారిషస్ బ్యాంకుకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి బకాయిలు చెల్లించాలని సూచించింది. లేనిపక్షంలో సుజనా ఇండస్ట్రీస్ మూసివేతకు సంబంధించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా బహిరంగపర్చవచ్చునని మారిషస్ బ్యాంకుకు సూచించింది.

English summary
high court quashes sujana universal industries petition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X