షాక్: నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు 'ఢీ'!

హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు క్రేజ్ గతంలో ఉన్నంతగా ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో వీక్షకులను టీవీల ముందు కూర్చునేట్లు చేసేదని అంటున్నారు. కానీ, రెండో దఫా వస్తున్న షోకి మొదటి దఫా అంత క్రేజ్ రావడం లేదని అంటున్నారు.

సులభమైన ప్రశ్నలే కాకుండా.. అర్థవంతంలేని సమాధానాలు కనిపించడం కూడా అందుకు కారణమని అంటున్నారు. ఈ దఫా ప్రశ్నలలో మెదడుకు మేత అంతగా కనిపించడం లేదంటున్నారు. పలు కారణాల వల్ల మీలో ఎవరు కోటీశ్వరుడు రేటింగ్ కూడా గతంలో కంటే పడిపోయిందట!

గత ఏడాది డిసెంబర్ 31న నాగార్జునకు జూనియర్స్ బుల్లితెర ఢీ షో షాక్ ఇచ్చిందని అంటున్నారు. ఆ రోజున ఈ షో కంటే అదేరోజు అదే సమయానికి ప్రారంభమైన ఢీ జూనియర్స్ రియాలిటీ షో ప్రోగ్రాంకు ఎక్కువ రేటింగ్ వచ్చిందట. కాగా, మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ డిసెంబర్ 8న ప్రారంభమైన విషయం తెలిసిందే.

 Is Meelo Evaru Koteeswarudu TRPs sliding down?

కాగా, మీలో ఎవరు కోటీశ్వరుడులో నాగార్జున అప్పుడప్పుడు సెలబ్రెటీలను తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ముకుంద హీరో వరుణ్ తేజ్, తమన్నా, పూజా హెగ్డే తదితరులను తీసుకు వచ్చారు. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్.

ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా మొదటి సీజన్లో టిఆర్పి రేటింగ్స్‌లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది. ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ ఈ రోజు( డిసెంబర్‌ 8) నుంచి ప్రారంభం అయింది. రాత్రి 9.30 గంటలకు మాటీవీలో ఈ షో ప్రసారం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+