నావి లేకుండా, ఈటెల ఫోటాలా: నాయిని ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డికి కోపం వచ్చింది. ముక్కు మీద కోపం మొహానికే అందం అన్నట్లుగా ఆయన తెలుగు విశ్వవిద్యాలయంలో తన అగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీల్లో మంత్రి ఈటెల రాజేందర్ ఫోటోలు ఎందుకు పెట్టారంటూ నిలదీశారు.
ఈటెల రాజేందర్ సమావేశానికే రాలేదని, తాను సీనియర్ నాయకుడినని, అంతే కాకుండా హోం మంత్రిగా ఉన్నానని, అయినా తన ఫొటోలు ఎందుకు పెట్టలేదని ఆయన అన్నారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కారు దిగగానే చేతిని పైకి చూపిస్తూ ‘ఫ్లెక్సీలో నా ఫోటో కనిపించడం లేదు. ఆహ్వానం పత్రంపై నా పేరు ముద్రించలేదు. నేను హోంశాఖ మంత్రిని.. అల్లాటప్పా వ్యక్తిని కాదు'అని నిర్వాహకులపై మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ దొంగలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనుల ప్రగతికి కేసీఆర్ పూర్తి స్థాయిలో కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలపై నిజాయితీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆయన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.












Click it and Unblock the Notifications