ప్లీజ్ అవసరమైతే కూర్చోండి: జైట్లీకి తప్పలేదు
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పట్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ ఊదారత ప్రదర్శించారు. కావాలంటే దయచేసి కూర్చుని, బడ్జెట్ పాఠాన్ని చదవండి అని స్పీకర్ మంత్రికి సూచించారు. తన పట్ల ఆమె చూపిన పట్టింపునకు జైట్లీ థ్యాంక్స్ చెప్పారు. అవసరమైతే తర్వాత కూర్చుంటానని జైట్లీ చెప్పారు
ఆ తర్వాత 20 నిమిషాలు ప్రసంగం చేసిన అనంతరం స్పీకర్ సూచనను ఆయన పాటించారు. భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 8.5 శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

నిరుడు జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మధ్యలో ఆయన కూర్చున్నారు. బిజెపి ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత జైట్లీ ఆ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వెన్ను నొప్పి కారణంగా ఆయన ప్రసంగం మధ్యలో కూర్చున్నారు.
ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారు. నెల పాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. డయాబెటిక్ కండీషన్‌కు ఆయన చికిత్స పొందారు. అదే విధంగా గ్యాస్ట్రిక్ బైపాస్ ప్రోసిజర్ కూడా చేయించుకున్నారు. ఈ స్థితిలో స్పీకర్ మంత్రికి ఆ సూచన చేసినట్లున్నారు.












Click it and Unblock the Notifications