వాన: గండిపేట చెరువులో పూజారుల జపం(ఫోటోలు)
హైదరాబాద్: వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గండిపేట జలాశయం గురువారం మార్మోగింది. వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు వరుణ జపం నిర్వహించారు.
బాలాజీ ఆలయ అర్చకులతో పాటు హైదరాబాద్ వేదభవన్ వేద పండితులు కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. బాలాజీ ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో వరుణ జపం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు చెరువులో పూజలు నిర్వహించారు.

గండిపేట జలాశయంలో పూజారుల వరుణజపం
వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గండిపేట జలాశయం గురువారం మార్మోగింది. వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు వరుణ జపం నిర్వహించారు.

గండిపేట జలాశయంలో పూజారుల వరుణజపం
12 మంది వేద పండితులతో పాటు చిలుకూరు బాలాజీ పూజారులు ముగ్గురు, మొత్తం 15 మంది పూజారులు బృందం చెరువులోకి వెళ్లి నడుము వరకు నీటిలో మునిగి వరుణ జపం చేశారు. వర్షాలు కురవాలని 108 సార్లు వరుణ మంత్రాన్ని జపించారు.

గండిపేట జలాశయంలో పూజారుల వరుణజపం
వర్షాల కోసం దేవాలయాల్లో భక్తులు పూజలు చేయాలని చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ అన్నారు. వరుణ జపం అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వామి వారి అనుగ్రహంతో వరుణ జపం నిర్వహించడం జరిగిందన్నారు.

గండిపేట జలాశయంలో పూజారుల వరుణజపం
వీరాటపర్వం, పారాయణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 108 సార్లు వరుణుడిని ప్రార్ధిస్తూ మంత్రజపం చేసినట్లు చెప్పారు. వరుణ జపం తర్వాత జలాశయంలోని నీటితో ఆలయంలోని గరుత్మంతుడికి అభిషేకం చేశారు.












Click it and Unblock the Notifications