టైమివ్వకుంటే అసహ్య దృశ్యాలు: జగన్ హెచ్చరింపు?
హైదరాబాద్: అసెంబ్లీలో తమకు మాట్లాడటానికి సమయం ఇవ్వకపోతే సభలో అసహ్యకరమైన దృశ్యాలు (అగ్లీ సీన్స్) చూస్తారని ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారని సమాచారం.
సభలో ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై జరిగిన చర్చలో భాగంగా.. ఓ దశలో జగన్ ఆవేశపడ్డారంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై సభాపతి కోడెల శివప్రసాదరావు కల్పించుకున్నారు. జగన్‌ను మందలించారు. ఒక స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, అసెంబ్లీ నిర్వహణలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, దాని ప్రకారం సభ నడుస్తుందని, మీరు సభకు మొదటిసారి వచ్చారు. సభ నియమాలు, పద్ధతులు తెలుసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్ వ్యాఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారట. జగన్‌కు సభా పద్ధతులు చెప్పాలని వైసీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. కాగా, సభలో ఎవరు ఎంత సేపు మాట్లాడాలన్న దానిపై వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై అధికారపక్షానికి అరవై శాతం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి నలభై శాతం సమయం ఇస్తున్నట్లు ఈ సమావేశంలో స్పీకర్ చెప్పారు.
తనకు అధిక సమయం ఇవ్వాలని జగన్ అడగగా... చంద్రబాబు కల్పించుకున్నారు. ఇప్పుడు మీ విషయంలో స్పీకర్ చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తనకు మైక్ రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చేదని, మా పార్టీ వాళ్ళ సమయం మొత్తం తీసుకొని నేనే మాట్లాడేవాడినని చెప్పారు. సభను మరికొన్ని రోజులు పొడిగించాలని వైసీపీ సభ్యులు కోరారు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యం.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు సభలో...

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు శాసన సభలో...

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. శాసన సభ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్.












Click it and Unblock the Notifications