బాబు చేతిలో పవన్ పావు: సాక్షి, జగన్‌తో పోటీవద్దనే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం పైన, రాజధాని ప్రాంత రైతుల సమస్యల పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హఠాత్తుగా స్పందించడం వెనుక రాజకీయం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పేర్కొంది. పవన్‌ను ఉపయోగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించింది.
జగన్ పర్యటన సమయంలోనే... వాయిదా
రాజధాని రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని జగన్ భావించారు. ఇందుకోసం ఈ నెల 3వ తేదీన ఆయా గ్రామాల్లో పర్యటించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఒకరోజు ముందు ఆయనను పర్యటించేలా చూస్తోందని అభిప్రాయపడింది. ఇలా జనసేన అధినేత పవన్‌ను మరోసారి చంద్రబాబు చేతిలో పావుగా మారారని వ్యాఖ్యానించింది.
జగన్ పర్యటన ద్వారా గ్రామాల్లోని రైతుల ఆగ్రహావేశాలు ప్రభుత్వం పైన వెల్లడవుతుందని భావించిన ప్రభుత్వం.. పవన్ పర్యటన ద్వారా అవి లేవని చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తోందని పేర్కొంది. చంద్రబాబు తాను చెప్పదలుచుకున్న విషయాలను పవన్ ద్వారా ప్రజలకు చెప్పించే ప్రయత్నాలు చేశారని అభిప్రాయపడింది.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబుకు కేంద్ర బడ్జెట్ చుక్కలు చూపించిందని, పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించిందని, దీంతో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో అంతు చిక్కని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అంతేకాకుండా రాజధానికి సంబంధించిన ముఖ్య అంశాలు బడ్జెట్లో ప్రస్తావించలేదని రాసింది.
రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల రాబట్టేందుకు బడ్జెట్‌కు ముందే పలుమార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడం, మిత్రపక్షమైన బీజేపీ వైఖరిలో వచ్చిన మార్పు, జరీబు గ్రామాల రైతులకు అదనంగా ప్రకటించిన ప్యాకేజీపై వెల్లువెత్తిన వ్యతిరేకత నేపథ్యంలో.. రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన సాగితే పరిస్థితి జఠిలంగా మారుతుందని భావించి చంద్రబాబు.. పవన్‌ను రంగంలోకి దింపారని పేర్కొంది.
పవన్ పర్యటన అంతా వ్యూహాత్మకమేననే వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో జనసేన నాయకులు రాజకీయ అంశాలపై స్పందించలేదని, అయితే గురువారం అకస్మికంగా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో కొందరు తమను కాపాడాలని పవన్‌ను కోరారని, పవన్ కళ్యాణ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఓ పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. పవన్ పర్యటన వాయిదా పడింది. వైసీపీ అధ్యక్షులు జగన్ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన పర్యటనను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసుకోవడం గమనార్హం. జగన్ పర్యటన నేపథ్యంలో పోటీగా ఉండకూడదని ఆయన వాయిదా వేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
-
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
అన్నదాతకు భరోసా: రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లు! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే











Click it and Unblock the Notifications