భారీ షాక్: జ్యోతిష్కులతో జగన్ 3 గం.ల పాటు భేటీ?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.749 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ఈడీ ఆయన ఆస్తులను అటాచ్ చేసింది. ఆ సమయంలో ఆయన ఇఫ్తార్ విందులో ఉన్నారు. విషయం తెలియడంతో ఆయన ముఖకవళికలు మారిపోయాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం జ్యోతిష్కులతో భవిష్యత్తు చెప్పించుకున్న జగన్.. మళ్లీ వారిని ఆశ్రయంచారని అంటున్నారు.

జగన్‌కు 2016 జూన్ తర్వాత మంచి రోజులు ఉంటాయని అప్పుడు జ్యోతిష్కులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అందువల్లే పలుమార్లు మరో రెండేళ్లలో తాను అధికారంలోకి వస్తానని ఆయన చెబుతుండేవారని వాదనలు ఉన్నాయి. కానీ, ఈ జూన్‌లో ఆయనకు మంచి రోజులు బదులు ఆస్తుల అటాచ్ జరిగింది.

 After attachment, YS Jagan meet astrologer?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈసారి ఆటాచ్ జరగడం నాలుగోసారి. గతంలో మూడుసార్లు జరిగిన అటాచ్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.500 కోట్లు దాటలేదు. కానీ ఈసారి ఏకంగా రూ.750 కోట్లు అటాచ్ చేశారు. ఇది జగన్‌కు పెద్ద షాకేనని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో ఆయన మరోసారి జ్యోతిష్కులను సంప్రదించారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు లోటస్ పాండ్ నివాసానికి జ్యోతిష్కులను రప్పించిన జగన్ వారితో దాదాపుగా మూడు గంటల పాటు తన భవిష్యత్తుపై మంతనాలు జరిపినట్లుగా చెబుతున్నారు.

కష్టాల నుంచి గట్టెక్కాలంటే కొన్ని దోష నివారణ చర్యలు చేపట్టక తప్పదని జ్యోతిష్కులు ఆయనకు సూచించినట్లుగా కూడా చెబుతున్నారు. జ్యోతిష్కులను కలిసేందుకు జగన్.. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.

ఇదిలా ఉండగా, ఆస్తుల అటాచ్ నేపథ్యంలో జగన్ న్యాయవాదులతోను సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఒకేసారి రూ.750 కోట్లు అటాచ్ కావడం జగన్‌ను భారీ షాక్‌కు గురి చేసింది. అటాచ్‌మెంటుకు సంబంధించిన నోటీసులు ఈడీ అధికారులు జగన్‌కు అందించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+