షాక్: 'నయీంతో సిఎంలకు సంబంధాలు, సిట్ అధికారిపై స్కాం'

హైదరాబాద్: 1996 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, డీజీపీలకు నార్కో పరీక్షలు జరిపితే గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అసలు నిజాలు వెలుగు చూస్తాయని, వారు తమకేమీ తెలియదంటే తాను ఇందిరా పార్క్ వద్దనే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సిపిఐ నారాయణ సవాల్ చేశారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్

తెలంగాణ ప్రజా ఫ్రంట్

మంగళవారం నాడు ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో నయీం బాధితులు ధర్నా చేశారు. ఇందులో సిపిఐ నారాయణ, విరసం నేత వరవర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి ఎసరు వచ్చిందనే నయీంను హతమార్చాడన్నారు.

సిట్ అధికారిపై ఆయిల్ స్కాం ఆరోపణ

సిట్ అధికారిపై ఆయిల్ స్కాం ఆరోపణ

నయీం కేసు విచారిస్తున్న సిట్ అధికారి పైన ఆయిల్ స్కాం ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నయీం చేసిన హత్యల్లో పోలీసులకు ప్రమేయం ఉందని ఆరోపించారు. సీఎంలు, డీజీపీలకు నయీంతం సంబంధాల్లేవని తేలితే తాను ఆత్మహత్యకు సిద్ధమన్నారు.

గ్యాంగ్ స్టర్లను పెంచి పోషించారు

గ్యాంగ్ స్టర్లను పెంచి పోషించారు

నక్సలైట్లు, ప్రజా, పౌర హక్కుల సంఘాల వారిని అంతం చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండ కోసమే గ్యాంగ్ స్టర్లను పోషిస్తున్నారని ఆరోపించారు. సిట్ పైన తమకు నమ్మకం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఆ దర్యాఫ్తు కూడా హైకోర్టు పర్యవేక్షణలో జరగాలన్నారు.

విషపు చెట్టును వదిలి..

విషపు చెట్టును వదిలి..

హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని తాము పిల్ వేశామని చెప్పారు. దాంతో విషపు చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొక్కలను మాత్రమే పీకేస్తున్నారన్నారు. నయీం అరెస్టుకు అనుమతివ్వలేదని మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి చెప్పారని, అసలు ఈ కేసులో అమిత్ షా జైల్లో ఉండాలన్నారు. నయీం భూములను బాధితులకు పంచాలన్నారు. ప్రజల సమక్షంలోనే విచారణ జరపాలన్నారు.

వరవరరావు

వరవరరావు

నయీం అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని శేషన్న పేరుతో కొనసాగించేందుకు యత్నిస్తున్నారని, అందుకు ప్రభుత్వం సహకరిస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరిగేదాకా ప్రజాఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.

తెరాసలో కోవర్టులు

తెరాసలో కోవర్టులు

తెరాస నేత కోనపురి రాములు హత్యకు ఆ పార్టీలోని కోవర్టులే నయీం ముఠాకు సహకరించారని చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. 2014 ఎన్నికల ఫలితాలకు ముందు ఈ విషయాన్ని రాములే చెప్పారన్నారు. ఎంపీ కవిత, మంత్రులు ఈటల, జగదీశ్వర్‌రెడ్డి భూపంచాయతీల్లో అడ్డుపడుతున్నాడనే నయీంని ఎనకౌంటర్‌ చేయించారని ఆరోపించారు.

బెల్లి లలిత

బెల్లి లలిత

1996లో తన అక్క బెల్లి లలితను చంపేశారని, స్పిన్నింగ్‌ మిల్లులో పని చేస్తూ సీఐటీయూలో కొనసాగుతూ లలిత పాటలు పాడేదని, తెలంగాణ ఉద్యమంలో కీలకమైనందునే నయీం ముఠాతో అప్పటి ప్రభుత్వం హత్య చేయించిందని, లొల్లీ పుట్టే.. లొల్లీ పుట్టే.. తెలంగాణ లొల్లీ పుట్టే.. అనే పాట రాసిన తన భర్త కరుణాకర్‌ని చౌటుప్పల్‌లో అన్యాయంగా చంపేశారని, ఇన్నేళ్లూ వనవాసంలా ఊర్లు తిరిగి బతికామని, తమకు న్యాయం చేయాలని బెల్లి లలిత సోదరి సరిత అన్నారు.

నా భర్తను చంపేశారు

నా భర్తను చంపేశారు


నయీం అక్రమాలకు అడ్డుపడ్డందుకే తన భర్త పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా చంపేశారని పటోళ్ల వింధ్యా రెడ్డి అన్నారు. ఆటోలో కూర్చొని ఉండగా గొంతుకోసి కిరాతకంగా చంపారని, పైగా ఆయన దందాలు, భూకబ్జాలు చేశాడని నిందలు మోపారని, అక్రమంగా డబ్బు సంపాదించి ఉంటే తాను తన పిల్లలతో రోడ్డుమీద పడేదానినా, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నాన్నను చంపేశారు

నాన్నను చంపేశారు

తాను ఐదో తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రితో కలిసి నేను దుకాణానికి వెళ్లిన సమయంలో.. హఠాత్తుగా వచ్చిన ఆరుగురు వ్యక్తులు తన తండ్రిని చుట్టుముట్టి కత్తులతో 19 చోట్ల ఘోరంగా పొడిచి చంపారని, వాళ్లు నయీం మనుషులని తర్వాత తెలిసిందని, ఇప్పుడు తమకు న్యాయం కావాలని పురుషోత్తమ్ కూతురు స్వేచ్ఛ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+