వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2098నాటికి అతిపెద్ద ఇంటర్నెట్ శ్మశానంగా ఫేస్‌బుక్‌!

|
Google Oneindia TeluguNews

లండన్‌: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌.. దీని వినయోగదారుల సంఖ్య రోజు రోజుకు వేల సంఖ్యలో పెరుగుతూ పోతోంది. ఇప్పటికే కోటిమందికి పైగా ఫేస్‌బుక్ ‌ను వినియోగిస్తున్నారు. కాగా, ఈ పరిణామాలతో 2098 నాటికల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ శ్మశానంగా మారనుందని ఓ ఇంటర్నెట్ నిపుణుడు అంచనా వేశారు.

ఆ ఏడాది కల్లా ఫేస్‌బుక్‌ ఖాతాదారుల్లో జీవించి ఉండే వారి సంఖ్యను మృతులు అధిగమించే అవకాశముండటంతో ఆయన ఈ అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఓ ఖాతాదారు మరణిస్తే.. అతడి పేజీని సంస్థ 'స్మృతుల పేజీ'గా మారుస్తోంది. ఖాతాను పూర్తిగా తొలగించాలంటే అతడి ఖాతా వివరాలు తెలిసిన వేరెవరైనా లాగిన్‌ అయ్యి.. ఆ పని పూర్తి చేయాలి.

Also Read: ఫేస్‌బుక్‌లో ఇక వీడియో ద్వారా విష్ చేయొచ్చు

అయితే, కొన్నిసార్లు మృతుడి ఖాతా వివరాలు తెలిసిన వారు అప్పుడప్పుడూ అతడి ఖాతాను తెరుస్తుంటారు. దీంతో అతడు మృతి చెందిన తర్వాత సైతం ఖాతా క్రియాశీలంగా ఉంటోంది.

మరణించిన వారికి సంబంధించిన ఖాతాలను ప్రస్తుతం ఫేస్‌బుక్‌ కొనసాగిస్తుంటంతో అమెరికాలోని మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ విద్యార్థి హచెం సిదిక్కి తాజా అవగాహనకు వచ్చారు. ఇదే విధంగా కొనసాగితే సంస్థ వృద్ధి రేటు సైతం తగ్గడం మొదలవుతుందని ఆయన అంచనావేశారు.

Facebook to be world's biggest virtual graveyard by 2098?

అంతర్జాల వీలునామా ప్రణాళిక సంస్థ డిజిటల్‌ బియాండ్‌ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 9,70,000 మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారులు మరణించనున్నారు.

Also Read: ఒక్కరోజులో ఫేస్‌బుక్ సీఈఓ సంపద 40వేల కోట్లు

కాగా, 2010లో 3,85, 368 మంది, 2012లో 5,80,000 మంది ఖాతాదారులు మృతి చెందారు.
మృతుల ఖాతాలను స్వచలితంగా తొలిగించేందుకు ఫేస్‌బుక్‌ నిరాకరిస్తోంది. ఇదే విధానం కొనసాగితే మనం ఊహించిన దానికంటే ముందుగానే బతికున్న ఖాతాదారుల సంఖ్యను మృతులు అధిగమించే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ సమస్యకు కళ్లెం వేసేందుకు చనిపోయేముందే ఖాతాదారులు తమ అంతర్జాల వ్యవహారాలు పూర్తిచేసే ఓ వ్యక్తిని నియమించుకోవాలని ఫేస్‌బుక్‌ సూచిస్తోంది. దీంతో మరణించిన వారి ఖాతాలను నిలిపివేసే అవకాశముంటుందని యోచిస్తోంది.

English summary
Facebook is likely to become the world's biggest virtual graveyard by the year 2098, as the number of accounts of the deceased will outnumber the living on the social networking site, an expert has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X