నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం: మాజీ సీఎంకు బెదిరింపు
హైదరాబాద్: రూ.20 లక్షలు ఇవ్వకుంటే మీ కూతురును కిడ్నాప్ చేస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. మధుకొడా అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతుడైన, జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, ఆయనకు శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి.. తనను తాను దీపక్ జైస్వాల్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే మీ కూతురును కిడ్నాప్ చేస్తామని బెదిరించాడు.

ఈ మేరకు మధుకొడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాంచీలోని లాల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి తనకు ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్ నెంబరును కూడా పోలీసులకు ఇచ్చారు. ఫోన్ నంబర్ ఎవరిదన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications