గ్యాంగ్‌రేప్ చేశారంటూ పరీక్ష కేంద్రానికి వచ్చింది: అసలేమైందంటే..?
విశ్వవిద్యాలయం పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని.. తల్లిదండ్రులు తిడతారనే భయంతో తనపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని అందర్నీ నమ్మించింది.
నోయిడా: విశ్వవిద్యాలయం పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని.. తల్లిదండ్రులు తిడతారనే భయంతో తనపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని అందర్నీ నమ్మించింది. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నోయిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ యువతి పరీక్ష సమయానికి రాలేకపోయింది. అయితే, సఫ్ధర్ జంగ్ వద్ద తనపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. కారులో వచ్చిన దుండగులు.. మహామాయా ప్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది.

ఆమె పిర్యాదు మేరకు సఫ్దర్ జంగ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత ఈ కేసును నోయిడాకు బదిలీ చేశారు. దీంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పరీక్షకు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతోనే తనను గ్యాంగ్ రేప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని పోలీసు అధికారి అమర్‌నాథ్ యాదవ్ చెప్పారు.
ఇలాంటివి మరోసారి చేయకూడదని సదరు యువతిని హెచ్చరించి వదిలివేశామని ఆయన తెలిపారు. కాగా, యువతి ఈ విధంగా జరగని జరిగిందని ఫిర్యాదు చేయడం పట్ల పోలీసులతోపాటు తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications