వేడివేడి నూనెలో నుంచి చేత్తో వడలు తీసిన భక్తుడు
చెన్నై: భక్తులు మొక్కులుగా తలనీలాలు సమర్పిస్తారు. కాలి నడకన సుదూర ప్రయాణం చేస్తారు. దేవుడికి మొక్కుకొనే భక్తులు.. తాము ఏ మొక్కు మొక్కుకుంటే దానిని తీర్చుకుంటారు. అయితే, తమిళనాడులో ఓ భక్తుడు మాత్రం తాను తీర్చుకున్న మొక్కు షాకింగ్‌కు గురి చేస్తోంది.

అతను సలసల కాగే వేడి నూనెలో ఉన్న వడలను చేతులతో తీసి, అమ్మవారికి తన మొక్కును చెల్లించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూర్ బిల్లాలితొట్టి గ్రామంలోని ముత్తుమారి యమ్మన ఆలయ ఉత్సవాల్లో కనిపించింది.
ఆరు రోజుల నుంచి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతి రోజు అభిషేకం, ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ భక్తుడు తన మొక్కును తీర్చుకున్నాడు. భక్తులందరూ అమ్మవారి నామాలను పఠిస్తూ ఉండగా వేడి నూనెలో నుంచి చేతులతో వడలు తీశాడు. అనంతరం వాటిని అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించాడు.












Click it and Unblock the Notifications