కెసిఆర్ దూకుడు, మనోళ్లు ఉన్నారా... కాంగ్రెస్ భయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల వరుసగా ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని కూడా భయానికి గురి చేస్తోంది. తెలంగాణ సీఎం కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రలోభపడుతున్నారా? అని కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరా తీసుకుంటున్నారట.
గ్రేటర్ ఎన్నికల అనంతరం టిడిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక... 15మంది టిడిపి ఎమ్మెల్యేల్లో పదిమంది కారు ఎక్కారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తెరాసలో చేరారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ మరింత పెరిగింది.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు... రెడ్యా నాయక్ (డోర్నకల్), కాలె యాదయ్య (చేవెళ్ల), కనకయ్య (ఇల్లెందు), విఠల్ రోడ్డి (ముథోల్)లు తెరాసలో చేరారు. ఇప్పుడు టిడిపి నేతలు తెరాసలోకి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి గుబులు పట్టుకుంది.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకు పడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి ప్రారంభమైంది. తమ పార్టీకి చెందిన వారు ఎవరైనా వెళ్తున్నారా? అని పరస్పరం చర్చించుకుంటున్నారట.












Click it and Unblock the Notifications