షాక్: ఈ సైకో కిల్లర్! చంద్రబాబుకు వీరామాభిమాని!

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: జిల్లాలో సైకోగా మారి నాలుగు వరుస హత్యలతో కలకలం సృష్టించి పోలీసులకు పట్టుబడ్డ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ నేపథ్యం పరిశీలించిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి. జిల్లాలోని యర్రబొట్లపల్లి అనే గ్రామానికి చెందిన వెంకటేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, ఆయన తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అని తెలిసింది.

సినిమాల ఎఫెక్టే: పగలు కూలీ! రాత్రి దోపీడీలు: మూడు హత్యల సైకో కిల్లర్ ఇతడే

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో పచ్చ కండువా కట్టుకుని చంద్రబాబుతో కలిసి నడుస్తూ ఫోటోలు తీయించుకుని తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ కూడా చేశాడు ఈ హంతకుడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికాలకు తెలియజేయడంతో, ఆపై కాసేపటికే వెంకటేశ్ ఫేస్‌బుక్ ఖాతా ఇంటర్నెట్ నుంచి మాయమైంది.

This psycho killer is Chandrababu's fan

అప్పటికే చంద్రబాబు, వెంకటేశ్ కలిసున్న చిత్రాలు మరిన్ని సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కాయి. కాగా, ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులే లక్ష్యంగా వారి ఇళ్లలోకి ప్రవేశించి సుత్తితో తలపై మోది హత్యలు చేసిన వెంకటేశ్.. గత నెల వ్యవధిలో నాలుగు హత్యలు చేశాడు.

ప్రస్తుతం కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తాను రాంగోపాల్ వర్మ రూపొందించిన సినిమాలను చూసి ఈ హత్యలకు, దోపిడీలకు పాల్పడినట్లు నిందితుడు వెంకటేష్ పోలీసులకు వివరించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that psycho killer Venkatesh is Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu's big fan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X