నేరం తప్పించుకోడానికి 12ఏళ్లు మూగవాడిగా.. నిజంగానే మాటపోయింది!

Subscribe to Oneindia Telugu

బీజింగ్‌: హత్యా నేరం నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి 12 ఏళ్లు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి.. చివరకు నిజంగానే నోటిమాట కోల్పోయాడు. ఈ ఘటన చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్సులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 2005లో జెంగ్ అనే వ్యక్తి తన భార్య బంధువొకరిని హత్య చేశాడు.
అద్దెకు సంబంధించిన వివాదమే అందుకు కారణం. అనంతరం హత్యకేసు నుంచి తప్పించుకునేందుకుగాను జెంగ్‌ వేరే ప్రావిన్సుకు పారిపోయాడు. అక్కడ మూగవాడిలా నటిస్తూ ఓ నిర్మాణసంస్థలో పనిలో చేరాడు.

A murder accused did the drama of becoming a dumb for 12-years then turned dumb

అంతేగాక, పేరు మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. అయితే, జెంగ్‌ వద్ద గుర్తింపుపత్రాలేవీ లేకపోవడంతో పోలీసులు అతడ్ని విచారించారు. ఆ తర్వాత డీఎన్‌ఏ పరీక్షలతో అసలు విషయం బయటపడింది.

12 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హంతకుడి తల్లిదండ్రులతో అతడి డీఎన్‌ఏ సరిపోలింది. ఆపై జెంగ్‌ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, 12 ఏళ్లుగా మూగవాడిగా నటించడంతో జెంగ్‌ నిజంగానే మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయాడు. అతను 12ఏళ్లలో ఎప్పుడూ మాట్లాడకపోవడంతో సంబంధిత వ్యవస్థ పని చేయకుండా పోయిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A murder accused did the drama of becoming a dumb for 12-years then turned dumb.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి