వార్నీ.. ఈ పరుపు ధరకు.. ఇల్లే కొనొచ్చు!

మ్యాట్రెస్ తయారీ రంగ సంస్థల్లో ఒకటైన హాస్టన్ దేశంలోనే తొలిసారిగా ప్రీమియం రేంజి పరుపులను తయారు చేసింది. వీటిని బెంగళూరు కేంద్రంగా విక్రయిస్తోంది.

బెంగళూరు: మామూలుగా ఇంటి నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చవుతుందంటేనే.. వామ్మో అంతనా అని బెంబేలు పడతాం. అలాంటిది ఒక పరుపు ఖరీదు రూ.40 లక్షలు అంటే.. గుండె లటక్కున జారిపోతుంది.

కానీ రూ.40 లక్షల పరుపు నిజంగానే ఉంది. మ్యాట్రెస్ తయారీ రంగ సంస్థల్లో ఒకటైన హాస్టన్ దేశంలోనే తొలిసారిగా ప్రీమియం రేంజి పరుపులను తయారు చేసింది. వీటిని బెంగళూరు కేంద్రంగా విక్రయిస్తోంది.

సన్ రైజ్ హోం సొల్యూషన్ అనే సంస్థతో కలిసి ఈ అత్యంత ఖరీదైన పరుపులను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.4.5 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.40 లక్షలు. పైన ఫొటోలో కనిపిస్తున్న పరుపు వైపు ఓ లుక్కేయండి. దాని ధర అక్షరాలా నలభై లక్షల రూపాయలు.

God.. If You Skip this Mattress, You Can Purchase a House

హ్యాండీక్రాఫ్ట్ కావడం వల్లే ధర కాస్తంత ఎక్కువే ఉంటుందని హాస్టన్ సంస్థ ప్రతినిదులు చావు కబురు చల్లగా సెలవిస్తున్నారు. ఎంత హ్యాండీ క్రాఫ్ట్ అయితే మాత్రం పరుపుకు మరీ అంత ధరా?

ఆ పెట్టే డబ్బేదో ఓ ఇంటికి పెట్టుకుంటే సొంత ఇల్లే వస్తుంది కదా. సొంతిల్లు ఉంటే ఆ మజాయే వేరు. అందులో ఇంతెత్తు పరుపు లేకపోతే.. లేకపాయె.. చాపేసుకుని పడుకున్నా మనల్ని అడిగే వాడెవడు? ఏమంటారు??

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+