వింత : సముద్రగర్భంలో పెళ్ళి, ప్రత్యేక ఉంగరాలు, దండలు మార్చుకొన్నజంట

ఓ ప్రేమికుల జంట కేరళలోని సముద్ర గర్బంలో పెళ్ళిచేసుకొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికతో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉంగరాలు, దండలతో గంటపాటు సాగింది.

కేరళ:పెళ్ళిని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. కాని, కేరళకు చెందిన ఓ ప్రేమజంట తమ పెళ్ళిని వేరైటీగా జరుపుకొని వార్తల్లో నిలిచారు.

సముద్రగర్భంలో వివాహం చేసుకొని ఈ ప్రేమ జంట వార్తల్లోకెక్కారు. మహరాష్ట్రకు చెందిన నికిల్ పవార్ ,స్లోవేకియన్ దేశానికి చెంది వధువు యూనికా పోగ్రాన్ లు సముద్ర గర్భంలో పెళ్ళిచేసుకొన్నారు.

సముద్ర గర్భంలో పెళ్ళిచేసుకొనేందుకు గాను కేరళ రాష్ట్రంలోని కోవలం సముద్ర గర్భంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు.

kerala couple gets married under the sea

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులిద్దరూ ఉంగరాలు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దండలను మార్చుకొన్నారు.సముద్ర తీరంలోని బీచ్ వేదికగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ వేడుక సుమారు గంటపాటు సాగింది. సైగల ద్వారా ఈ పెళ్ళి సందర్బంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కోవలం నగరంలోని జాక్సన్, బోండ్ సఫారీ సంస్థలు ఈ వినూత్న పెళ్ళి వేడుకలను నిర్వహించాయి.

సముద్ర గర్భంలో వివాహమంటే సంతోషంగా అన్పించినా, కొంత భయపడిన మాట కూడ వాస్తవమేనని వధువు యూనికా ప్రోగ్రాన్ చెప్పారు.అయితే కేరళ సముద్ర గర్భంలో జరిగిన ఈ పెళ్ళిని వరుడి స్వంత రాష్ట్రమైన మహరాష్ట్రలో రిజిష్టర్ చేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+