గ్రామాల్లోనే పోస్టుమార్టం: టి స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ సభాపతి మధుసూధనా చారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకులను గ్రామాల్లోనే పోస్టుమార్టం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ సభాపతి మధుసూధనా చారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకులను గ్రామాల్లోనే పోస్టుమార్టం చేస్తామని హెచ్చరించారు.
కొందరు నేతలు గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం నుంచి అది వచ్చిందా, ఇది వచ్చిందా అని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications