మోడీపై చంద్రబాబు అసహనం, రంగంలోకి వెంకయ్య నాయుడు, హామీ?
అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఇద్దరు కలిసి తొలుత గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి జేకేసీ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనేందుకు ఒకే వాహనంలో వచ్చారు.
Recommended Video

అయితే అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఇద్దరు కలిసి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఇక్కడ ఇరువురు నేతలు ఇరవై నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చి వెంకయ్య.. చంద్రబాబుతో కాసేపు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వెంకయ్యను రంగంలోకి దింపారా?
బడ్జెట్ కేటాయింపులపై వీరి భేటీలో చర్చకు వచ్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారా అనే చర్చ సాగుతోంది. జేకేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెప్పారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తూనే ఉంటానని చెప్పారు.

ఏపీకి హామీ
ఏపీకి అన్యాయం జరగకుండా చూస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. బహిరంగంగా ఏపీకి, బాబుతో భేటీ సమయంలో ఆయనకు ధైర్యం చెప్పి ఉంటారని, బీజేపీ ఆయనను రంగంలోకి దింపి ఉంటుందని భావిస్తున్నారు.

చంద్రబాబు వెళ్లి మోడీతో మాట్లాడుకోవాలి
బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ అసంతృప్తిపై సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఏపీకి నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు వెళ్లి ప్రధాని మోడీతో మాట్లాడాలని సూచించారు. కేంద్రం ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్‌కు నిధులు రాకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చెప్పారు.

తెగదెంపులు తొందరపాటు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెగదెంపులు అనే విషయమై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. అది తొందరపాటు అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆందోళన తమ పార్టీ సమావేశాల్లో ప్రతిఫలిస్తుందని చెప్పారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications