గ్రీన్ టీ.. ఒక్కసారి తాగి చూడండి: ఎన్నో బెనిఫిట్స్..!

ఈ మధ్యకాలంలో గ్రీన్ టీ మీద ప్రజలకు అవగాహన పెరిగింది. రోజూ తాగే టీకి ప్రత్యామ్నాయంగా దీనిపై ఆధారపడుతున్నారు. ఇదివరకు లెమన్ టీని చాలామంది ఇష్టపడేవారు. దాని స్థానాన్ని గ్రీన్ టీ ఆక్రమించుకుంటోంది. ప్రజల అభిరుచులను గమనించిన టీ తయారీ కంపెనీలు కూడా దీని మీద దృష్టి పెట్టాయి. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల వల్లే దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ టీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి.

క్రమం తప్పకుండా రోజూ కనీసం రెండు కప్పుల గ్రీన్‌ టీ తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును తగ్గించడానికి గ్రీన్ టీ పనిచేస్తుంది. ఒబేసిటీకి అద్భుత ఔషధంగా ఉపకరిస్తుంది. గ్రీన్ టీలో బయో యాక్టివ్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఎపిగ్యాల్లోక్యాటెచిన్-3-గ్యాల్లెట్టె (ఈజీసీజీ) ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే అత్యంత శక్తిమంతమైన బయో యాక్టివ్ కాంపౌండ్‌గా దీన్ని భావిస్తారు. సహజమైన యాంటీయాక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి.

Green Tea increases the fat burning, know the other health benefits of Green Tea

కణాలు దెబ్బతినడాన్ని ఇది నివారిస్తుంది. సెల్స్ అండ్ మాలిక్యూల్స్ డ్యామేజీ లేకుండా దోహదపడుతుంది. అనేక రకాల వ్యాధులను నివారించడానికి అత్యవసరమైన గుణాలు గ్రీన్ టీలో ఉన్నట్లు శాస్త్రీయబద్ధంగా నిర్ధారించారు. గ్రీన్ టీ ఎల్-థియానైన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడు చురుకుగా పనిచేయడానికి దోహద పడుతుంది. రక్త ప్రసరణ సజావుగా సాగేలా ఇది ఉపకరిస్తుంది. ఎల్-థియానైన్ యాసిడ్ యాంటీ యాంగ్జయిటీగా పని చేస్తుంది.

మెదడుకు ఆల్ఫా వేవ్స్‌ను అందేస్తుంది. న్యూరోట్రాన్స్‌మీటర్‌గా ఎల్ థియానైన్ పని చేస్తుంది. కెఫిన్, ఎల్-థియానైన్ యాసిడ్.. రెండూ మెదడు పనితీరును శక్తిమంతంగా మార్చివేయడానికి సహకరిస్తాయని అధ్యయనంలో తేలింది. కాఫీతో పోల్చుకుంటే.. అందులో ఉండే కెఫిన్‌ కంటే తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. దానికి ఎల్-థెయనైన్ జత కలిస్తే.. మెదడు పనితీరును మరింత బూస్ట్ చేస్తుందని శాస్త్రీయబద్ధంగా గుర్తించారు.

కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుంది. మెటబాలిక్ రేటును ఇది మరింత పెంచుతుంది. కేన్సర్ వంటివి దరి చేరనివ్వకుండా చేయగలుగుతంది. యాక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కేన్సర్‌కు ప్రధాన కారణం. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడటానికీ యాక్సిడేటివ్ డ్యామేజీ కారణమౌతుంది. దీన్ని నివారించడానికి యాంటీఆక్సిడెంట్స్ అవసరమౌతాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ అనేవి గ్రీన్ టీలో అత్యధికంగా ఉంటాయి.

గ్రీన్ టీ అనేది అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టెట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి దుష్ప్రభావాన్ని 40 శాతం వరకు గ్రీన్ టీ తగ్గించినట్లు నిర్ధారించారు. ఒక వయస్సు దాటిన తరువాత ఏర్పడే అల్జీమర్స్‌ను కూడా నివారించే శక్తిసామర్థ్యాలు గ్రీన్ టీలో ఉన్నాయి. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాటెచిన్ జ్ఞాపక శక్తిని పెంపొందించుతాయి. గ్రీన్ టీ అల్జీమర్స్ దరి చేరకుండా నివారించగలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+